20 June, 2026 | 2:36 AM

20 ప్రాంతాల్లో ఆధునిక ధాన్య సైలోలు

20-06-2026 12:00 AM
  1. మొదట 50 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతోఏర్పాటు 
  2. సైలోల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు గుర్తించాలి 
  3. ధాన్యం నిల్వకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరి ఉత్పత్తి ఎక్కువగా ఉండే జిల్లాల్లోని 20 ప్రాం తాల్లో అత్యాధునిక సైలోల ఏర్పాటుపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్య నిల్వ, రవాణా రంగా నికి చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సచివాయలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రా ష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగో ళ్లు ఏటా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉం చుకుని నిల్వ సామర్థ్యాలను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైలోల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ప్రారంభ దశలో 50 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నెట్వర్క్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

ఈ సైలోలు ప్రస్తుతం అమలులో ఉన్న ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అనుబంధంగా పనిచేసే ఆధునిక మౌలిక వ సతులుగా ఉపయోగపడతాయని స్ప ష్టం చేశారు. తెలంగాణలో రైతుల నుం చి ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక సంఘాలు, ఇకేపీ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా వారి పాత్ర కొనసాగుతుందన్నారు.

సమావేశంలో పా ల్గొన్న సాంకేతిక నిపుణులు ఆధునిక సైలోల ద్వారా ధాన్యం స్వీకరణ నుంచి నిల్వ, రవాణా వరకు మొత్తం ప్రక్రియను ఆటోమేటెడ్ పద్ధతిలో నిర్వహిం చవచ్చని వివరించారు. డిజిటల్ నాణ్యత పరీక్షలు, యాంత్రిక అన్‌లోడింగ్ , సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ, శాస్త్రీయ నిల్వ విధానాల ద్వారా ధా న్యం నాణ్యతను దీర్ఘకాలం కాపాడవచ్చని తెలిపారు.

రైల్వే అనుసంధా నం తో కూడిన ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశవ్యాప్తంగా వినియోగ కేంద్రాలకు వేగంగా తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. వరి ఉత్పత్తి జిల్లాల్లో సైలోల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నిల్వ సామర్థ్యాలు, పెట్టుబడి వ్యయం, అమలు విధానాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంస్థలను మంత్రి ఆదేశించారు.