16 June, 2026 | 4:12 AM

రాబోయేవి సైబర్ యుద్ధాలే

16-06-2024 12:42 AM
  1. ఆధునిక సమరం యుద్ధ భూమికే పరిమితం కాదు
  2. నిన్నటి ఆలోచనలతో రేపటి యుద్ధాలను చేయలేం
  3. వైమానిక దళాధిపతి వీఆర్ చౌదరి

హైదరాబాద్, జూన్ 15( విజయక్రాంతి): నిన్నటి ఆలోచనలతో రేపటి యుద్ధాలను చేయలేమని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పేర్కొన్నారు. ఆధునిక సమరం యుద్ధభూమికే పరిమితం కాదని అభిప్రాయపడ్డారు. సైబర్ టెక్నాలజీ, డాటా నెట్‌వర్క్‌లు ఆధునిక యుద్ధాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్‌ఏ)లో 235 ఆఫీసర్స్ శిక్షణ ముగిసిన సందర్భంగా శనివారం జాయింట్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చౌదరికి ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ నగేశ్‌కపూర్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ ఎస్ శ్రీనివాస్ స్వాగతం పలికారు.

అనంతరం శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లకు రాష్ట్రపతి కమిషన్‌ను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. సైనికులు ఆధునిక యుద్ధ పోకడలను అలవర్చుకోవాలని సూచించారు. తప్పనిసరిగా సాంకేతికతను సమ ర్థంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధునిక యుద్ధంలో విజయం సాధించడానికి టెక్నాలజీ నిర్ణయాత్మక పాత్రను పోషి స్తుందని పేర్కొన్నారు. ప్రతి అధికారికి సమర్థత, దూకుడు, చొరవ.. ఈ మూ డు లక్షణాలు ఉండాలని చౌదరి సూచించారు. పరేడ్ సందర్భంగా దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ట్రైనింగ్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్యాడెట్లకు వీఆర్ చౌదరి ప్రశంసాపత్రాలను అందజేశారు.  22 మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. పరేడ్ సందర్భం గా భారత నావికాదళానికి చెందిన 9 మంది అధికారులు, దేశ తీర రక్షణ దళానికి చెందిన మరో 9 మందితో పాటు స్నేహపూర్వక విదేశాల నుంచి ఒకరని వింగ్స్‌తో ఏఎఫ్‌ఏ సత్కరించింది.