16 June, 2026 | 6:30 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడి హత్య

16-06-2024 12:40 AM

పటాన్‌చెరు, జూన్ 15 : వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకునే ఓ తల్లి హత్య చేసిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  ముత్తంగి సర్వీస్ రోడ్ నుంచి కర్దనూర్ గ్రామానికి వెళ్లి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని బాలుడి శవం ఉందని ఈ నెల 11న ముత్తంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 13న బాలుడి ఆచూకీ కనుక్కొన్నారు. 

కర్రే విష్ణువర్థన్ తండ్రి రాజు అలియస్ కుమార్(8) పాత రాంచంద్రపురానికి చెందిన వాడిగా గుర్తించారు. ఆ అడ్రస్‌కు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది.  బాలుడు తల్లి కర్రే స్వాతిని విచారించగా అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు గొంతు నుమిలి చంపింది. రెండో పెళ్లి చేసుకున్న అనిల్‌ను  నమ్మించడానికి ఉరివేసుకుని చనిపోయాడని చెప్పింది.   ఇద్దరు కలిసి మృతదేహాన్ని స్కూటీపై తరలించి ముత్తంగి శివారులో ఓఆర్‌ఆర్ పక్కన చెట్ల పొదల్లో పడేశారు.  స్వాతితోపాటు అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.