5 August, 2026 | 1:53 AM

ఇందూరు బస్‌స్టాండ్‌ను ఆధునీకీకరించండి

05-08-2026 12:00 AM

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : నిజామాబాద్ బస్ స్టాండ్ ఆధునీకీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారా యణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన బస్ స్టాండ్‌కు స్థలం కేటాయించాలని అనేకసార్లు మంత్రులను కలిసినట్టు గుర్తుచేశారు. అప్పటివరకు ప్రస్తుత బస్ స్టాండ్‌ను మెరుగుపర్చాలని విజ్ఞప్తిచేశారు.

ప్రయాణికుల కోసం విశాలమైన వేచియుం డే హాలు ఏర్పాటుచేయాలని, బస్సుల రాకపోకల సమాచారాన్ని అందించే డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేయాలని కోరారు. సీసీ కెమెరాలను, తగిన సిబ్బందిని నియమించాలని విన్నవించారు. ప్రైవేట్ వాహనాలు, ఆటో రిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.