calender_icon.png 12 September, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంభీరావుపేటకు చేరిన 'మోదీ కానుక'

12-09-2025 12:33:07 PM

బండి సంజయ్ జన్మదినం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు 111 సైకిళ్ల పంపిణీ

గంభీరావుపేట,(విజయక్రాంతి): కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తన జన్మదినాన్ని పురస్కరించుకుని “మన మోదీ కానుక” పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట మండలానికి కేటాయించిన 111 సైకిళ్లను మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో కేజీ టు పీజీ ప్రాంగణంలో బాలుర, బాలికల, ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 111 మంది విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ “దూరం విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో బండి సంజయ్ విద్యార్థులకు సైకిళ్లు కానుకగా అందించారు.

సైకిల్ రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. సైకిల్ నడపడం రాని వారు నేర్చుకోవాలి. రోడ్డు నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా నడపాలి” అని సూచించారు. పలువురు తల్లితండ్రులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా , చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు వీలవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు కోడె రమేష్ మాట్లాడుతూ సైకిల్ పంపిణీ ఒక గొప్ప కార్యక్రమమని, విద్య ప్రగతికి తోడ్పడే మోదీ కానుక అందించిన బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడె రమేష్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, హెచ్ ఎం లు శ్రీనివాస్, దేవయ్య, పద్మ , జిల్లా అధికార ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, దేవసాని కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు గంటా అశోక్, పత్తి స్వామి, రాజేందర్, కృష్ణకాంత్ యాదవ్, నాయకులు దేవేందర్, విగ్నేష్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.