12-09-2025 12:45:30 PM
ముత్తారం,(విజయక్రాంతి): కరీంనగర్ మానేరు డ్యాం గేట్లు(Manair Dam gates Lifting) ఎత్తివేయడంతో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు మానేరు నదిలో ఇసుక ట్రాక్టర్లు ఇరుక్కున్నాయి. గురువారం రాత్రి ఇసుక కోసం వచ్చిన ట్రాక్టర్ల లో ఇసుక నింపుతుండగా, మానేరు నది ఒక్కసారి ఉదృతంగా రాగా ఇసుక ట్రాక్టర్ లు మానేరు నదిలో చిక్కుకున్నాయి. వరద ఉధృతిని చూసిన ట్రాక్టర్ల డ్రైవర్లు, కూలీలు హుటాహుటిన ఒడ్డుకు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.