calender_icon.png 12 September, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రపురం స్మశానవాటికలో అభివృద్ధి పనులు ప్రారంభం

12-09-2025 12:50:02 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నాగేష్

రామచంద్రపురం,(విజయక్రాంతి): “అభివృద్ధి అనగానే గుర్తుకొచ్చేది రామచంద్రపురం డివిజన్”(Ramachandrapuram cemetery) అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం స్మశానవాటికలో సీసీ రోడ్లు, వెయిటింగ్ హాల్, బార్బర్ షెడ్, ధోబి ఘాట్, గ్రీనరీ, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.98 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, ఎస్ఎస్ కేశవులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.