12-09-2025 01:42:32 PM
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూటి రఫీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె ను, కేశనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బక్కతట్ల కుమార్ యాదవ్ అనారోగ్యంతో ఉండగా ఆయనను, పోతారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెలకల జితెందర్ యాదవ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతనిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అధైర్య పడద్దని అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ట తిరుపతి యాదవ్, ముత్తారం మాజీ జడ్పిటిసి, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.