12-09-2025 01:40:56 PM
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District ) ఆర్యవైశ్య మహిళా సంఘం కోశాధికారిగా మంథని పట్టణానికి చెందిన రావికంటి రేణుక ను నియమించినట్లు పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్యు సంఘం అధ్యక్షులు నలమాస్ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. రేణుక గతంలో సంఘానికి చేసిన సేవలను వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా మహిళా సంఘానికి సేవలందించడం కోసం రేణుకను నియమిస్తామని అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి తెలిపారు. ఆర్యవైశ్య సంఘానికి సేవ చేసే వారికి మంచి గుర్తింపు ఉంటుందని వారు తెలిపారు.