calender_icon.png 12 September, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏచూరి ఆశయాలు సాధిస్తాం

12-09-2025 12:30:54 PM

సీపీఎం మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్

హుజూర్ నగర్: సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం(Yechury Sitaram) ఏచూరి ఆశయాలను సాధిస్తామని సీపీఎం మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఏచూరి సీతారాం ప్రధమ వర్ధంతి(Yechury Sitaram first death anniversary) సందర్భంగా మండలంలోని  శ్రీనివాసపురం గ్రామంలో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ...ప్రపంచంలో కమ్యూనిజం వేగంగా విస్తరిస్తుందని భవిష్యత్ మనదేనని పేర్కొన్నారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కుల, మత రాజకీయాలపై పోరాడాల్సిన అవసరముందన్నారు. ఏచూరి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తంగెళ్ళ వెంకటచంద్ర,షేక్ ఖాసీం, షేక్ సైదా, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు తంగెళ్ళ గోపరాజు, శాఖ సభ్యులు వీరస్వామి,శ్రీను,వీరబాబు, నూకల అంజయ్య,భూక్య సైదమ్మ,తదితరులు,పాల్గొన్నారు.