01-02-2026 02:59:26 AM
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్
ముషీరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): మహిళా సాధికారత కోసం ప్రధాని మోడీ పెద్దపీట వేశారని ఓబిసి మోర్చా జాతీ య అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన మెగా సర్వీస్ ఆక్టివిటీ కార్యక్రమంలో భాగంగా శనివారం చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో ఉచిత కుట్టు శిక్షణ పొం దిన 82 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ లను ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి డా కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంపా నాగేశ్వర్ రావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు అశోక్ కుమార్ స్వేని, లింగారెడ్డి, చైర్ పర్సన్స్ టిటి రెడ్డి, ఎంఏస్. ప్రకాష్, అధ్యక్షులు చేంద్ర మోహన్, సుమన్, విజేందర్ రెడ్డి, కాసం శ్రీనివాస్, కమలాకర్, సెరిపల్లి గణేష్, హేమంత కుమార్, కల్లూరి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, ప్రవీణ్, మధు, బీజేపీ సికింద్రా బాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.