16 April, 2026 | 7:19 AM

మోదీకి జీ-7 ఆహ్వానం

07-06-2025 12:00 AM

ఫోన్ చేసిన కెనడా ప్రధాని 

న్యూఢిల్లీ, జూన్ 6: భారత ప్రధాని నరేంద్ర మోదీని జీ-7 సమావేశాల్లో పాల్గొనాలని కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం ఫోన్‌లో ఆహ్వానించారు. నిజ్జర్ హత్య తర్వాత కెనడాతో సంబంధాలు క్షీణించాయి. జీ-7లో సభ్యత్వం లేకపోయినా కొన్నేళ్లుగా భారత్ సమావేశాల్లో పాల్గొంటూ వస్తోంది. ఈ యేడు కెనడాలో జరిగే సమావేశాలకు భారత్‌కు ఆహ్వానం అందదేమో అని అంతా భావించారు.

కానీ స్వయంగా కెనడా ప్రధానే ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. కెనడా ప్రధాని ఫోన్ చేసి జీ-7 సమావేశాల్లో పాల్గొనాలని ఆ హ్వానించినట్టు భారత ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నెల౧౫ నుంచి ౧౭ వరకు కెనడా వేదికగా సమావేశాలు జరగనున్నాయి. జీ-7లో అమెరికా, జపాన్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జర్మనీలు సభ్యదేశాలుగా ఉన్నాయి. తనను ఆహ్వానించడంపై మోదీ కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.