16 May, 2026 | 5:35 PM

మోడీకి కార్పొరేట్లపై ఉన్న ప్రేమ పేదలపై లేదు

16-05-2026 04:46 PM

సీపీఐ  కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి

ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్రంలో అధికారం ఉంది కదా అని బిజెపి ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కార్పొరేట్లపై ఉన్న ప్రేమ పేద ప్రజలపై లేదని సీపీఐ కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి ఆరోపించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు శనివారం సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కమాన్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేయడం జరిగిందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,టేకు మల్ల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.