6 April, 2026 | 4:56 PM

Breaking News

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •  

కాంగ్రెస్ గాలితో మోదీ ప్రస్టేషన్

02-05-2024 01:30 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, మే 1(విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్ అనుకూల పవనాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్టేషన్‌కు గురవుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిపల్లి వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. భాజపా పాలిత రాష్ట్రాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీసం కోడిగుడ్లు సరఫరా చేయలేని స్థితిలో ఉన్నాయని ఆరోపించారు. గత పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. నల్లధనం తీసుకవస్తామని నల్లచట్టాలు తీసుకవచ్చారని, నిరుద్యోగులను మోసం చేశారని, జన్‌ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని అబద్దాలు చెప్పారని విమర్శించారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.