6 April, 2026 | 5:52 PM

ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు

06-04-2026 04:09 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం బాసర దేవాలయ బ్రహత్ ప్రణాళిక పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమం(Inaugural Ceremony of Basara Temple Master Plan Reconstruction Project)లో ఆయన పర్యటన సందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, నిమ్మల రమేష్ శాలువాతో సన్మానించారు.  బాసర కార్యక్రమానికి తరలి వెళ్లిన ఖానాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరిని ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వెడమా బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కల్పించారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టం కొరకు, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని సీఎం చెప్పినట్లు కౌన్సిలర్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పినట్లు తెలిపారు.