6 April, 2026 | 5:52 PM

సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు

06-04-2026 04:19 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ మాట్లాడుతూ... సెస్‌ను ఎంపిడిసీఎల్‌లో విలీనం చేయడం ద్వారా పారదర్శక పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సెస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై, వినియోగదారుల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి గురయ్యాయని ఆరోపించారు.

ప్రస్తుతం ఎంపిడిసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 200 కనెక్షన్లు మంజూరు చేయడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని, రైతులు మరియు పారిశ్రామిక వర్గాలకు తక్కువ ధరకే కనెక్షన్లు అందించడం వల్ల వారికి ఉపశమనం కలిగిందని చెప్పారు.

ఇకపై దళారుల అవసరం లేకుండా ‘మీ సేవ’ ద్వారా సులభంగా సేవలు పొందవచ్చని సూచించారు. రైతులకు అనుకూలంగా కేటగిరీల వారీగా ధరలు నిర్ణయించడం వల్ల వారికి లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ మార్పులతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేరల నర్సింగ్ గౌడ్, డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, పరుశురాం, నాయకులు బైరినేని రాము, మునిగేలా రాజు, సునీల్ రెడ్డి, శ్రీరామ్ గౌడ్, మీరాల శ్రీను, లహరి, మల్లయ్య, కిషన్, అశోక్ ప్రేమ తదితరులు, రైతులు పాల్గొన్నారు