15 August, 2026 | 12:43 AM

జలదోపిడీని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలం..

15-08-2026 12:09 AM

బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కిస్టిపాటి అంజిరెడ్డి

పాలకవీడు, ఆగస్టు 14 : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కిస్టిపాటి అం జిరెడ్డి అన్నారు.

పాలకీడులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,ని యోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆదేశానుసారం , విలేకరుల సమావే శం ఏర్పాటులో మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు క్రిస్టిపాటి అంజిరెడ్డి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.శ్రీశైలం ప్రాజె క్టు నుంచి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కు నీటిని తరలించుకుపోతుంటే తెలంగా ణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కో మటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతులకు సాగునీరు అందకుండా చేసి ఆంధ్రా రైతులకు నీటిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు,శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై ప్రభు త్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై రాజీ పడవద్దని సూచించారు.

రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాగిరెడ్డిగూడెం సర్పంచ్ నాగయ్య, నాయకులు, సైదులు, హరి నాయక్, గణపతి రెడ్డి, అచ్చయా,విజయ్, తదితరులు పాలుగోన్నారు.