సూక్ష్మ కళాకారుడి ప్రతిభ
15-08-2026 12:08 AM
కోదాడ, ఆగస్టు 14 : కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం పుచ్చకాయపై మహాత్మా గాంధీ గారి చిత్రమును చెక్కారు. గతంలో పెన్సిల్ మొనపై జాతీయ జెండాను చెక్కడం జరిగింది. ఆవగింజ పై జాతీయ జెండా, పది మిల్లీల వెడల్పు గల సూది రంధ్రంలో మూడు రంగుల జెండా నూలు దారాలు ఎక్కించడం వంటి సూక్ష్మ కళారూపాలు తయారుచేసి జాతీయ, అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకోవడం గమనార్హం.






