17 April, 2026 | 7:17 PM

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి

30-05-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 29 (విజ యక్రాంతి): అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను పాఠశాలల ప్రారంభానికి  ముందే పనులు పూర్తి చేయాలని కెవిపి ఎస్సీ జిల్లా కార్యదర్శి దినకర్, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు  టికానంద్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఏవో కిరణ్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభానికి కేవలం 15 రోజులు మాత్రమే ఉందని మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలన్నారు.ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో అధికారులు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.