17 April, 2026 | 5:50 PM

భూభారతిలో రైతులకు పట్టా పుస్తకాలివ్వాలి

29-05-2025 10:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): నూతన భూభారతి చట్టంలో మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతులకు ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు(CS K Ramakrishna Rao)ను కలిసి శుభాకాంక్షలు తెలిపి, గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై విన్నవించారు. తమ గ్రామంలో 43 సర్వే నంబర్లలో 1,827 ఎకరాల భూమి ని అధికారులు సర్వే చేశారని, అందులో 1,633 ఎకరాల భూమి రైతుల కాస్టులో ఉండగా, మిగిలిన 194 ఎకరాల్లో గ్రామం, పాఠశాల, చెరువు ఇతర నివాసయోగ్యమైన ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ద్వారా జూన్ 2 నుండి ప్రారంభం కానున్న భూభారతి నూతన చట్టం ప్రకారం తమ గ్రామ రైతులకు కొత్తగా పాస్ పుస్తకాలు అందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.