6 July, 2026 | 4:04 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

మాన్సూన్ శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్

17-06-2025 01:07 AM
  1. అంటువ్యాధుల కట్టడిపై నజర్

జీహెఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాడాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): వర్షాకాలంలో అంటువ్యాధు లు ప్రబలకుండా నివారించేందుకు మా న్సూన్ శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను ముమ్మ రం చేసినట్టు జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం లో భాగంగా సోమవారం ఆయన నల్లకుం ట ఫీవర్ హాస్పిటల్ సమీపంలో జరుగుతు న్న పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజారోగ్యాన్ని కాపా డేందుకు, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జీహెఎంసీ ప్రత్యేక కార్యక్రమం చేప ట్టిందన్నారు. ఈ ప్రయత్నంలో ఆయా ప్రాం తాల ప్రజలు, రాజకీయ నాయకులు జీహెఎంసీకి సంపూర్ణంగా సహకరించి ఈ డ్రైవ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు.

వార్డులలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ఒకే చోట కేంద్రీకరించకుండా, వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే వినియోగించుకోవాలని అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్‌ను కమిషనర్ ఆదేశించారు. ఆయనవెంట అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఏఎంహెచ్ హేమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.