6 July, 2026 | 3:09 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ముజీబ్ ఆధ్వర్యంలో అన్నదానం

17-06-2025 01:08 AM

ఎంఎన్‌జే ఆసుపత్రి ఆవరణలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్-గెజిటె డ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో  సోమవారం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో సుమా రు వెయ్యిమంది పేద రోగుల సహాయకులకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్, ఎం.సత్యనా రాయణ గౌడ్, ఉపాధ్యక్షులు టీ.పర్వతాలు హాజరయ్యారు.

హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్య క్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఖలీద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ముకీమ్ ఖురేషి, టీఎన్జీవో ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బి శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా ఏపీఆ ర్‌ఓ మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్ పాల్గొన్నారు.

మీడియాతో ముజీబ్ మాట్లా డుతూ.. కీర్తిశేషులైన తల్లిదండ్రుల పేరు మీద, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగుల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు.