calender_icon.png 27 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాను.. అప్రమత్తంగా ఉండాలి

27-10-2025 08:07:12 PM

బి.వరప్రసాద్ తహశీల్దార్ శాలిగౌరారం..

నకిరేకల్ (విజయక్రాంతి): రాబోయే 2, 3 రోజులలో మొంథా తుఫాను ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున శాలిగౌరారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాలిగౌరారం తహశీల్దార్ బి.వరప్రసాద్ కోరారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే రెండు రోజులు(28, 29) తుఫాను ప్రభావం ఉండటంతో తీవ్ర లోతట్టు ప్రాంతాలకు, కరెంట్ స్తంభాల వద్దకు, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలలో పొంచి ఉన్న విద్యుత్ వైర్లు, విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు రైతులు, ప్రజలు వెళ్లొద్దని ఆయన సూచించారు.