27-10-2025 08:10:12 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ ను సోమవారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును ఎస్సై బండి రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని, రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, అనుమానితులపై నిఘా పెంచాలని ఆదేశించారు.
సైబర్ నేరాలు, గంజాయి, మత్తు పదార్థాలు, ఫోక్సు చట్టం, షీ టీంలో పనితీరు, డయల్ 100 పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేర నియంత్రణపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో కలిసి మొక్క నాటారు. డీసీపీ వెంట బెల్లంపల్లి ఏసిపి ఏ .రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనూక్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.