calender_icon.png 27 October, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి..

27-10-2025 08:02:51 PM

ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పోలీసు అమరవీరుల త్యాగాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. యాంటీ డ్రగ్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ పోలీసుల పాత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.