27 March, 2026 | 8:58 PM

తొలి విడత నామినేషన్ల మరింత అప్రమత్తం

29-11-2025 12:40 PM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ తొలి విడత  ఎన్నికల  నామినేషన్ల స్వీకరణకు నేడు శనివారం  చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు  అభ్యర్థులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరణకు నామినేషన్ పత్రాలు, హెల్ప్ డెస్క్ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో మొదటి విడతలో గండీడ్,మహమ్మదా బాద్,నవాబ్ పేట్,రాజాపూర్,మహబూబ్ నగర్ మండలాలలో 139 గ్రామ పంచాయతీలు, 1188 వార్డులకు నేడు నామినేషన్లు స్వీకరణ నేటితో ముగుస్తుందని తెలిపారు.  ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరణకు సమయం ఉందని, అభ్యర్థులు నిర్దేశించిన సమయంలోగా నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు చేసిన క్లస్టర్ గ్రామ పంచాయతీలో నామినేషన్లు దాఖలు వేసుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, మార్గదర్శకాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.అభ్యర్థులు ఆలస్యం చేయకుండా, నిర్ణీత సమయాల్లోనే నామినేషన్లు దాఖలు చేసుకోవాలని తెలిపారు