గ్రామస్థాయిలో దోమల నివారణ చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), గ్రామస్థాయిలో దోమల నివారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువా న్ తెలిపారు. జాతీయ కేటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము క్రింద సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ ఆఫీసర్ మురళి, జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల , మిషన్ భగీరథ అధికారి రమేష్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రజిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి ఈ సమావేశానికి హాజరైనారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లాడుతూ జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో దోమల నివారణ చర్యల కొరకు పాటించవలసిన జాగ్రత్తల గురించి డి.పి.ఓ.ద్వారా ఎం.డి.ఓ.లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.
పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భముగా ప్రతి గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో పరిసరాల పరిశుభ్రత ఉండేలాగా తగు చర్యలు చేపట్టాలని డి.పి.ఓ., డి.ఈ.ఓ., డి.డబ్ల్యు. ఓ. లకుసూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు , డిప్యూటి డి.ఎం.హెచ్.ఓ.లు , వైద్య శాఖ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.






