24 May, 2026 | 3:24 AM

బుర్హాన్ అంత్యక్రియలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

24-05-2026 01:08 AM

సయ్యద్ సలాహుద్దీన్, భక్త్ జమీనాఖాన్, పాక్ ఐఎస్‌ఐ నాయకులు హాజరు

వారికి ఏకే 47, అధునాతన ఆయుధాలతో పహారా

ఇస్లామాబాద్, మే 23: ఇస్లామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ అంత్యక్రియల్లో అంతర్జాతీయ ఉగ్రవాదులు పాల్గొన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్ బదర్ అధినేత భక్త్ జమీనా ఖాన్ హాజరయ్యారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో వచ్చిన సీనియర్ ఉగ్రవాదుల కు ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో మరికొందరు ఉగ్రవాదలు పహారా కాచారు. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ గురువారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

శుక్రవారం జరిగిన బుర్హాన్ అంత్యక్రియల ప్రార్థనలకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న పలువురు వాంటెడ్ ఉగ్రవాదులు హాజరయ్యారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్ బదర్ అధినేత భక్త్ జమీనా ఖాన్‌తోపాటు పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకి చెందిన వారు కూడా పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో టెర్రరిస్ట్‌లకు భారీ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.