17 July, 2026 | 1:54 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

‘బొద్దింకల’ వెబ్‌సైట్ నిలిపివేత

24-05-2026 01:06 AM

ఇప్పటికే సోషల్‌మీడియా ఖాతాలన్నీ తొలగింపు

అప్రజాస్వామిక చర్య: పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే

న్యూఢిల్లీ, మే ౨౩: కొద్దిరోజులుగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి చెందిన వెబ్‌సైట్‌తో పాటు సోషల్‌మీడియా ఖాతాలన్నింటినీ భారత నిఘావర్గాలు నిలిపివేశాయి. ఇప్పటికే ఈనెల ౨౧న పార్టీ ‘ఎక్స్’ ఖాతాను నిఘావర్గాలు నిలిపివేయగా, మర్నాడు ‘ఇన్‌స్టా’ పార్టీ బ్యాకప్ ఖాతాను మెటా సంస్థ తొలగించింది. ఈ పరంపరలో భాగంగానే శనివారం నిఘా సంస్థలు పార్టీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సైతం నిలిపివేసింది.

ఖాతాల తొలగింపు, వెబ్‌సైట్ నిలిపివేతపై పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ.. నిఘా వర్గాల చర్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తాము కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టడం వల్లే కేంద్రం ఈ నియంతృత్వ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. రాజీనామా డిమాండ్‌కు మద్దతుగా దేశావ్యాప్తంగా 6 లక్షల మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేశారని గుర్తుచేశారు. తమను బొద్దింకలుగా పేర్కొన్న వారు, ఇప్పుడా బొద్దింకలకు ఎందు భయపడుతున్నారని ప్రశ్నించారు.