18 July, 2026 | 6:20 PM

Breaking News

ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •  

ఏసీబీ వలకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

16-05-2026 07:59 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఏసీబీ వలకి చిక్కిన మరో అవినీతి తిమింగలం, యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం రోజున ఏసీబీ వలన చిక్కిన మోటకొండూర్ అసిస్టెంట్ లైన్ రమేష్, మేడికుంటపల్లి గ్రామ రైతు పన్నాల అనంతరెడ్డి  ఒక ట్రాన్స్ఫార్మర్, నాలుగు ఫోళ్లు కావాలని దరఖాస్తు చేసుకోగా అసిస్టెంట్ లైన్మెన్ రమేష్ రూ.35000/- లు లంచం అడిగారు. వెంటనే రైతు తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో డి ఎస్ పి జగదీష్ కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు,  ఏసీబీ విసిరిన వలలో రెడ్ హ్యాండెడ్ గా రమేష్ డబ్బులు   రూ. 35000/- లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగిన ఎడల మమ్మల్ని సంప్రదించండి అని అవినీతిని అరి కడదాం అని ప్రజలకు సూచించారు.