18 July, 2026 | 6:50 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

మంథని ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు

16-05-2026 07:55 PM

మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేసి అవసరమైతే మరోచోట ఏర్పాటు చేస్తామని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్  తెలిపారు. మంథని మున్సిపాలిటీలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అనే కథనం విజయ క్రాంతి పత్రిక లో ప్రచురితం కాగా స్పందించిన కమిషనర్ విజయ్ క్రాంతితో మాట్లాడుతూ... గత 15 రోజుల క్రితమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మంథని పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తరలించే ప్రక్రియ ప్రారంభించామన్నారు. త్వరలోనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మత్తులు చేసి అవసరమైతే మరోచోట ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంథని పట్టణ ప్రజలకు ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరమాత్తులు చేస్తామని కమిషనర్ తెలిపారు.