24 April, 2026 | 12:40 AM

మానవ అక్రమ రవాణా నిందితుడి అరెస్ట్

09-12-2024 01:26 AM

హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్, డిసెంబర్ 8: ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమ్రాన్ హైదర్ అలియాస్ జైదీ అనే నిందితుడు అలీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ద్వారా నిరుద్యోగులను మోస గించి థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు  వారిని అక్రమంగా పంపి నకిలీ కాల్ సెంటర్లు తెరిచి సైబర్ నేరాలు చేయిస్తున్నాడు. కమ్రాన్, మంజూర్ ఆలమ్ అలియాస్ గుడ్డు, సాహిల్, ఆశిష్ అలియాస్ అఖిల్,  పవన్ యాదవ్ అలియాస్ అఫ్జల్ అనే నలుగురితో కలిసి  థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు భారతీయులను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో కమ్రాన్ చేతిలో మోసపోయిన ఢిల్లీకి  చెందిన నరేశ్ లఖావత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును ఎన్‌ఐఏకు పోలీసులు బదిలీ చేశారు.  కమ్రాన్‌పై రూ. 2 లక్షల రివార్డును ప్రకటించడంతో అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. హైదరాబాద్‌లో తలదాచుకున్న కమ్రాన్‌ను నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ పోలీసులు ఆదివారం  అరెస్ట్ చేశారు.