రుద్రంపూర్ డిస్పెన్సరీ లో ఫిజియోథెరపీ యూనిట్ ప్రారంభం
కొత్తగూడెం, మార్చి 18 (విజయ క్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన, అత్య ఆధునిక ఫిజియోథెరపీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమము కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెకట్స్) కె. వెంకటేశ్వర్లు పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెకట్స్) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఫిజియోథెరపీ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కొత్తగూడెం ఏరియాలో, పనిచేయుచున్న సింగరేణి ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు, స్థానిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఈ యూనిట్ను మరింత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి పరచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రుద్రంపూర్ డిస్పెన్సరీని అత్యాధునిక సదుపాయాలతో, తీర్చిదిద్దాల్సిందిగా సంబంధిత చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్. కిరణ్ రాజ్ కుమార్ కి ఆదేశించడం జరిగింది.
ఇలా ఆధునికరించడం ద్వారా ఉద్యోగులు, వైద్య పరీక్షల కొరకు మెయిన్ హాస్పిటల్ వరకు రాకుండా, దగ్గర ఉన్న రుద్రపూర్ డిస్పెన్సరీ నందు వైద్య సేవలు పొందవచ్చు తద్వారా, మెయిన్ హాస్పిటల్ వరకు,వెళ్లే దూర భారాన్ని, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, అని తెలియజేశారు. అనంతరం డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెకట్స్) కె. వెంకటేశ్వర్లు వి.కె కోల్ మైన్స్ను సందర్శించి, వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి చేయు పని స్థలాలను పరిశీలించి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయుటకు కావలసిన సూచనలను, సలహాలను సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది.
జిఎం తో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్. కిరణ్ రాజ్కుమార్ గారు, కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జున రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి నరసింహారావు, ఏజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఇతర విభాగాధిపతులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




