6 May, 2026 | 4:06 AM

బావిలో జారిపడి తల్లి ఇద్దరు కూతుళ్ల మృతి

06-05-2026 02:46 AM

బట్టలు ఉతికేందుకు వెళ్లగా ప్రమాదం

5, 6 తరగతులు చదువుతున్న చిన్నారులు 

కంగ్టి మండలం బోర్గిలో ఘటన

కంగ్టి, మే 5(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘట న సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బోర్గి గ్రామంలో చోటుచేసుకుంది. మృతులు సావి త్రి బాయి (30), నిఖిత (12), నందిని (13)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం సావి త్రి బాయి తన ఇద్దరు కూతుర్లు, తన బావ రాజు జాదవ్ కూతురు నందిత కలిసి బట్టలు ఉతికిందుకు సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లారు.

బకెట్‌తో నీరు తేవడానికి వెళ్లిన నంది త కాలు జారి బావిలో పడింది. గమనించిన నిఖిత ఆమెను పట్టుకొని బయటకు లాగే క్రమంలో ఇద్దరు బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రి బాయి ప్రయత్నించిగా నీటిలో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నందిత సిర్గాపూర్ కస్తూర్బా హాస్టల్‌లో 5వ తరగతి చదువుతుంది. నిఖిత మొగుడంపల్లి గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి తెలిపారు.