calender_icon.png 11 January, 2026 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదర్ డెయిరీ చైర్మన్ రాజీనామా

09-01-2026 12:02:49 AM

  1. అప్పుల గండంతో పదవి వదులుకున్న మధుసూదన్‌రెడ్డి
  2. కొత్త చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి 

ఎల్బీనగర్, జనవరి 8: మదర్ డెయిరి చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి పదవికి రాజీనామా చేశారు. నూతన చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. హయత్ నగర్‌లో ని నార్ముల్ (మదర్ డెయిరీ) ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశం రాసాభాసగా మారింది. పాల బిల్లు లు చెల్లించని పక్షంలో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయాల్సిందేనని డైరెక్టర్లు, రైతులు డిమాండ్ చేశారు.

ఆ అవిశ్వాస తీర్మానం సమావేశం దాదాపు 3 గంటలకు పైగా జరిగింది. తీర్మానంలో జరిగిన చర్చలో తనను చైర్మన్‌గా చేస్తే రైతులకు రూ.12 కోట్ల రూపాయల పాల బిల్లులను చెల్లిస్తానని డైరెక్టర్ మందాడి ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. దీంతో మధుసూదన్‌రెడ్డి రాజీ నామా చేశారు. మధుసూదన్‌రెడ్డి రాజీనామా అనంతరం బోర్డు మీటింగ్ జరిగింది.

సంస్థ అభివృద్ధి కోసం రూ.12 కోట్లు చెల్లిస్తానని ముందుకొచ్చిన డైరెక్టర్ మందాడి ప్రభాకర్‌రెడ్డిని చైర్మన్‌గా పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రైతులకు వెంట నే 4 నెలల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, రా బోయే కాలంలో పెండింగ్ బిల్లులు లేకుండా చూసుకుంటానని తెలిపారు.