calender_icon.png 11 January, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ జాబితా సరిచేయాలని ర్యాలీ

09-01-2026 12:02:45 AM

బైంసా, జనవరి ౮ (విజయక్రాంతి): మునిసిపల్ ఎన్నికల సందర్భంగా భైంసాలో ఇటీ వల అధికారులు వార్డుల వారిగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితా లోపభూ ఇష్టం గా ఉందని బిజెపి  నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరును తప్పుపడుతూ గురువారం బైంసాలో ర్యాలీ నిర్వహిం చి సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని ఆయా వార్డుల జాబితాలో సంబంధంలేని వ్యక్తుల పేర్లను చేర్చుతూ జాబితాలను రూ పొందించారని ఆరోపించారు. 

ఓవర్గ రాజకీ య పక్షం నాయకులకు తలోగ్గిన అధికారులు ఇలాంటి తప్పులతడకగా ఉన్న ఓటర్ జాబితాలను రూపొందించాలని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వర్గం నివాసాల ఇంటి నెంబర్లపై పై సంబంధం లేని మరో వర్గం పేర్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఓటరు జాబితాలను వార్డుల వారిగా సవరించాలని డిమాండ్ చేశారు.