అమ్మా.. చల్లంగా చూడు
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో కన్నుల పండువగా బోనాలు
- అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు
ఎల్బీనగర్, ఆగస్టు 16 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆదివారం బోనాల పండుగ కన్నుల పండువగా జరిగింది. ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కాలనీ సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం, బీఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్, నాగోల్, లింగోజిగూడ, చంపాపేట ఉమ్మడి డివిజన్లలో ప్రజలు గ్రామదేవతల ఆలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
సాహెబ్ నగర్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఎల్బీనగర్ నియోజకవర్గం సుఖసంతోషాలతో, సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని వివిధ అమ్మవారి ఆలయాలను టీపీసీసీ అధికార ప్రతినిధిదర్పల్లి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం డివిజన్ లోని ఆలయాల్లో మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాహెబ్ నగర్ డివిజన్ లోని అమ్మవారి దేవాలయాలను మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి పూజలు చేశారు. హయత్నగర్, మన్సూరాబాద్, బీఎన్ రెడ్డి నగర్ ఉమ్మడి డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్, హయత్ నగర్, బృందావన కాలనీ, వీరన్న గుట్ట కాలనీలోని దేవాలయాలను టిపిసిసి ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్మన్ ఘాట్ డివిజన్ లో కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గోపాల్ ముదిరాజ్, మహేశ్వరం నియోజకవర్గం డాక్టర్స్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి తదితరులు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.






