17 August, 2026 | 2:43 AM

శ్రావణమాసం తొలి ఆదివారం ఉప్పలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

17-08-2026 02:06 AM

జనగామ, ఆగస్టు 16 (విజయక్రాంతి):  శ్రావణమాసం తొలి ఆదివారం సందర్భంగా జనగామ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి తామర పువ్వులతో అర్చన చేసి, తామర పువ్వుల మాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

అనంతరం నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక హారతి నిర్వహించారు. పూజల అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి కి పెట్టిన ప్రసాదాన్ని తీర్థప్రసాదాలలుగా,అందజేశారుభక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.