09-08-2024 12:48:05 AM
నిర్మల్ ఆగస్టు 8 (విజయక్రాంతి): నిర్మల్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకులంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ‘సెల్లార్‌లో చదువులు’ అన్న శీర్షికతో ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఈ మేరకు బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు గురుకులానికి వచ్చి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తరగతి గదుల కొరత, మరుగు దొడ్ల సమస్యను విద్యార్థులు తెలియజేశారు. అదనపు గదులు లేకపోవడంతో సెల్లార్‌లో పాఠాలు వింటున్నామన్నారు. సమస్యల పరిష్కారంపై బీసీ గురుకులాల కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.