20 March, 2026 | 3:32 AM

బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్

20-03-2026 12:00 AM
  1. ఇరువర్గాల తోపులాట, బాహాబాహి
  2. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు మేళా ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత
  3. బీఆర్‌ఎస్ కృషితోనే ఏర్పడిదంటూ ఆ పార్టీ నాయకుల నినాదాలు 
  4. ముమ్మాటికీ మా పార్టే నిర్మించిందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నినాదాలు 

నంగునూరు, మార్చి 19: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పా టు చేసిన రైతు మేళా ప్రారంభోత్సవం గురువారం ఉద్రిక్తతల నడుమ సాగింది. రైతు మ హోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పా టు చేసిన 150 స్టాళ్లను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకి టి శ్రీహరి, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మె ల్యే హరీశ్‌రావు ప్రారంభించారు.

మంత్రులు ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. మంత్రులు, ఎమ్మె ల్యే హరీశ్ రావు కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కృషి వల్లే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పడింది అంటూ ఆ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.

ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ నిర్మించిందంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్రతినినాదా లు చేశారు. ఇరువర్గాలు మధ్య తోపులాట జరిగగా, కొందరు కార్యకర్తలు బాహాబహికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. రైతు మేళ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ మంత్రులు నవ్వులలో మునిగితేలుతూ ఉండగా.. వేదిక ముందు ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేయడం కనిపించింది. ఇదంతా చూస్తూ బీజేపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. 

ఆయిల్‌పామ్ హబ్‌గా తెలంగాణ: మంత్రి తుమ్మల

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణను ఆయిల్‌పా మ్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు లక్ష కోట్ల రూపాయల పా మాయిల్‌ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నదని, ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలంటే మన రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి ఆదాయం ఉంటుందన్నారకు. సాగుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 22న ముఖ్యమంత్రి నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. 

రైతులకు ప్రోత్సాహం: స్పీకర్ గడ్డం ప్రసాద్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న వంటనూనెల డిమాండ్‌ను గుర్తించి రైతులు సంప్రదా య పంటల నుంచి ఆయిల్‌పామ్ సాగు వై పు మళ్లాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌లో ఇప్పటికే 2 నుం చి 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే లా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 

ప్రత్యామ్నాయ పంటల సాగుతో మేలు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

భవిష్యత్తులో వరి సాగు వల్ల తలెత్తే ఇ బ్బందులను అధిగమించాలంటే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. మలేషియా వంటి ఇతర దేశా ల నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో, మన దేశం ఒక్క లీటర్ కూడా దిగుమతి చేసుకోకుండా ఉండాలంటే ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపాలి‘ అని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే ఫ్యాక్టరీ పనులు: హరీశ్‌రావు

మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్ హయాంలోనే రూ.300 కోట్లతో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇదే సమయంలో రైతుల సమస్యలపై మంత్రి తుమ్మలకు ఆయన వినతిప త్రం సమర్పించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను తక్షణమే నెరవే ర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కో దండరెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు.