ఆదివాసీల హక్కుల రక్షణకు ఉద్యమం
మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, గ్రామసభల పాలన, మా ఊళ్లో మా రాజ్యం నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సంస్కృతి రక్షణ సమన్వయ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య దొర గురువారం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి అధ్యక్షుడిగా చందా లింగయ్య దొర, రాష్ట్ర కో -ఆర్డినేటర్‌గా పొడుగు శ్రీనాథ్, రాష్ట్ర కన్వీనర్లుగా పాయం సత్యనారాయణ, ముడావి నర్సింగ్రావు నియమితులయ్యారు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ ఆదివాసి సంఘాల అధ్యక్షులను కమి టీలో రాష్ట్ర కన్వీనర్లుగా చేర్చినట్లు చందా లింగయ్య దొర తెలిపారు.
గ్రామసభల అధికారాలను బలోపేతం చేయడం, భూమి పరాయీకరణను అరికట్టడం, అటవీ హక్కులను రక్షించడం, జల్, జంగల్, జమీన్‌పై ఆదివాసుల హక్కులను కాపాడడం సమితి ప్రధాన లక్ష్యాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వజ్జా నరసింహ రావు, సలహాదారు సంగెం శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.






