క్రిస్మస్‌కు కింగ్ 100
టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున ప్రస్తుతం తన మైలురాయి చిత్రం కోసం పనిచేస్తున్న సంగతి తెలిసింది. తన కెరీర్‌లో 100వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఇంతకాలం ప్రచారంలో ఉన్న వర్కింగ్ టైటిల్ ‘కింగ్ 100’నే సినిమా పేరుగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నాగార్జున వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ గ్లింప్స్ సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.
మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50 వేల కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ వీడియోలో నాగార్జునను అత్యంత స్టైలిష్, డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. మొత్తంగా టైటిల్ గ్లింప్స్ మజెస్టిక్‌గా, మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్; డీవోపీ: రాజా మహాదేవన్; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: సతీశ్‌కుమార్ ఎన్.






