calender_icon.png 12 December, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోగ్లీ ఒక రోజు వెనక్కి

11-12-2025 12:21:44 AM

యంగ్ హీరో రోషన్ కనకాల చిత్రం ‘మోగ్లీ 2025’పై బాలకృష్ణ ప్రభావం పడింది. బాలకృష్ణ నటించిన ‘అఖండ2’ గత వారం రిలీజ్ కావాల్సి ఉండగా, వాణిజ్య సమస్యల కారణంగా విడుదలను రద్దు చేశారు. సందిగ్ధ పరిస్థితుల నడుమ ఈ శుక్రవారం రిలీజ్‌కు వస్తోంది. దీంతో మోగ్లీ టీమ్‌కు ఒక రోజు వెనక్కి వెళ్లడం అనివార్యమైంది.

ముందుగా ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 12న కాకుండా డిసెంబర్ 13కు రానున్నట్టు వెల్లడించారు. ప్రీమియర్స్ మాత్రం 12నే ప్రారంభం కానున్నాయి. సందీప్‌రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా, రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్‌కళ్యాణ్ ఎడిటింగ్, కిరణ్ మామిడి ప్రొడక్షన్ డిజైన్ చేశారు.