calender_icon.png 11 December, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపు.. సర్కార్ అనుమతి

10-12-2025 07:00:43 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అఖండ 2’. బోయపటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనూహ్య కారణాలతో వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని థియెటర్లలో అఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. ఈ టికెట్ల ధరల పెంపు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వర్తిస్తుంది. డిసెంబర్ 11న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.600 ఖరారు చేయగా, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 పెంపునకు అనుమతించింది. టికెట్ ధరల పెంపుతో వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని, ఈ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాలో జమ చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది.