calender_icon.png 12 December, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్ ఆదర్శ కుటుంబం ఆరంభం

11-12-2025 12:22:53 AM

కుటుంబ కథాచిత్రాల కథానాయకుడి గా విక్టరీ వెంకటేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉం ది.  చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయా న్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. ఇప్పుడు వీరి కలయికలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్ సినీప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతు న్న ఈ సినిమా చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది.

షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఈ సినిమా పేరును సైతం టీమ్ ప్రకటించింది. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వెంకటేశ్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నారు. హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.