13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

28-03-2026 01:33 AM

మేడ్చల్ అర్బన్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణాన్ని తిలకించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘లోక కళ్యాణం కోసం శ్రీరాముడు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయం. ధర్మ స్థాపన కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ, స్థానిక బిజెపి నాయకులు కిషన్, సురేష్, సుంకు నవీన్, మహేష్, నాగరాజు, మధుసూదన్ రెడ్డి, మధు, భాను, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.