28 March, 2026 | 3:15 AM

బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు

28-03-2026 01:32 AM
  1. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం
  2. వదంతులు వ్యాప్తి చేసేవారిని ఊపేక్షించొద్దు 
  3. దుష్టశక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి 
  4. టీమీండియాలా కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ సూచన
  5. సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం 
  6. తెలంగాణ, ఏపీ నుంచి రేవంత్‌రెడ్డి, చంద్రబాబు హాజరు 

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి) : యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సం క్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసు కోవాలని, ఈ విషయంలో వదంతులు వ్యా ప్తి చేసేవారిని ఊపేక్షించొద్దని, దుష్టశక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఈ విపత్కర సమయంలో టీమీండియాలా కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ సీఎంలకు సూచించారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేల.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ శుక్రవా రం వర్చవల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తెలంగాణ, ఏపీ నుంచి రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతోపాటు మిగతా రాష్ట్రాల సీఎం లు, ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి సీఎస్‌లు హాజరయ్యారు. మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరి స్తున్న విధాలను, రాష్ట్రాలు అనుసరించాల్సిన పరిస్థితులను సీఎంలకు ప్రధాని మోదీ వివరించారు.

యుద్ధం వల్ల ‘పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్రాలు సన్నద్దతను సమీక్షించారు. పశ్చిమాసియాలో పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా అన్ని దేశాలపై పడిందని వివరించారు. టీమీండియా మాదిరిగా ముందుకు సాగాలన్నారు.‘గ్యాస్, పెట్రో ల్, డీజిల్‌ను అక్రమ నిల్వలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచా రం, వదంతులు వ్యాప్తి చేసినా, దుష్టశక్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.  

సజావుగా సరఫరా:సీఎం రేవంత్‌రెడ్డి

పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సం బంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమిం చి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని వివరించారు. ప్రభు త్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీ ఎం ప్రిన్సిపల్‌సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.