కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ కేకే
న్యూఢిల్లీ : బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పిన కె. కేశవరావు పార్టీకి షాక్ ఇచ్చిండు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లిన కేకే కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎంతో పాటు ఖర్గే నివాసానికి వెళ్లిన కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మధుయాష్కి, పీసీసీ చీఫ్ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. కేకే పార్టీలో చేరక ముందే ప్రియాంక గాంధీ ఆయనకు ఫోన్ చేసి పార్టీలో చేరడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కేశవరావు పని చేశారు. రాష్ట్ర విభజన తర్వా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు సొంతగూడికి చేరుకున్న కేకే ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పడు కేశవరావు పార్టీ మారడంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.






