calender_icon.png 10 August, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య

07-08-2025 06:10:40 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) లోక్ సభలో ప్రశ్నించారు. ఈ మేరకు స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే వివిధ పథకాల ద్వారా తెలంగాణ ఎమ్మెస్ ఏమి అందుతున్న మద్దతును వివరించారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన చిన్న పరిశ్రమలు యంత్రాలు కొనుగోలు చేసేందుకు గరిష్టంగా రూ.25 లక్షల వరకు 40% సబ్సిడీ అందేలా ఎన్ఎస్ఎస్ పథకం ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టుకునే వారికి 25–35% సబ్సిడీ, పట్టణాల్లో 15–25% సబ్సిడీ అందేలా పి ఎం ఈ జి పి  పథకం ఉంది. ఎస్‌సి, ఎస్‌టి, మహిళలకు మరింత ప్రయోజనం ఉందని తెలిపారు. హస్తకళల ఉత్పత్తులు చేసే వారికి విదేశీ ప్రదర్శనల్లో పాల్గొనడానికి సహాయం, రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్ ఖర్చులను భరిస్తున్న ఐసి పథకం ఉందని పేర్కొన్నారు. జాతీయ హస్తకళల అభివృద్ధి పథకం ( ఎన్ హెచ్ డి పి ) ద్వారా తెలంగాణ కళాకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమోషన్ లభిస్తోందని వివరించారు.