calender_icon.png 7 August, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్న పోలీసులు

07-08-2025 05:59:25 PM

సిద్దిపేట క్రైమ్: చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్(Chinnakodur Police Station) పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం అక్రమంగా డంపు చేసిన 100 టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెరుకు కనకయ్య, తోటపల్లి స్వామి, తోటపల్లి రాజు అనే వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక డంపు చేసి ఎక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా చిన్నకోడూర్ ఎస్ఐ సైఫ్ అలీ, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి అడ్డుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ బియ్యం, మొరం, మట్టి అక్రమంగా రవాణా చేసినా, పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి వద్దనైనా ఇటువంటి సమాచారం ఉంటే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ 8712667445, 8712667447, 8712667446, నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.